రెండు మద్యం బాటిల్లు ఉచితంగా అందించాలి

Two bottles of alcohol should be provided free of charge

Mar 19, 2025 - 16:33
 0
రెండు మద్యం బాటిల్లు ఉచితంగా అందించాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే డిమాండ్​
అన్ని ఉచితాలు ప్రజల డబ్బు కాదా?
ఇదీ అందిస్తే తప్పేంటీ?

బెంగళూరు: శక్తియోజన కింద రూ.2000, ఉచిత విద్యుత్​, ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు పురుషులకూ వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం అందించాలి అని కర్ణాటక జనతాదళ్​ (సెక్యులర్​) ఎమ్మెల్యే ఎం.టి. కృష్ణప్ప డిమాండ్​ చేశారు. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి పురుషుల నెత్తిన మద్యం పోశారు. అన్ని ఉచితాలు అందించినప్పుడు అది మన డబ్బు కాదా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు పురుషులకు కూడా రెండు బాటిళ్ల మద్యం అందించడంలో తప్పేముందన్నారు. సహకార సంఘాల ద్వారా ఈ చర్యను కూడా చేపట్టాలన్నారు. 

కృష్ణప్ప డిమాండ్​ పై స్పీకర్​ మాట్లాడుతూ.. మీరు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి చేయాలన్నారు. ఇప్పటికే తాము మద్యపానాన్ని పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం రెండు సీసాలు ఉచితంగా ఇస్తే రాష్ర్టంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలన్నారు. ఉచితంగా ఇస్తే పరిస్థితి స్వయం చాలకంగా మెరుగుపడుతుందని ఎం.టి. కృష్ణప్ప సమాధానం ఇచ్చారు. కాగా ఈయన డిమాండ్ పై అసెంబ్లీలో మిగతా నాయకులకు నవ్వాలో, విమర్శించాలో తెలియని గందరగోళంలో పడ్డారు. ఏదో తూతూ మంత్రంగా విమర్శిస్తూ చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి డిమాండ్​ ఎలా చేస్తారని ప్రశ్నించారు.