ఆప్​ సత్యేంద్రపై ఎఫ్​ ఐఆర్​ నమోదు

FIR registered against AAP Satyendra

Mar 19, 2025 - 16:06
 0
ఆప్​ సత్యేంద్రపై ఎఫ్​ ఐఆర్​ నమోదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కోట్లాది రూపాయల లంచం తీసుకొని జరిమానాలను మాఫీ చేశారనే ఆరోపణలపై ఢిల్లీ మాజీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్​ పై బుధవారం ఎఫ్​ ఐఆర్​ నమోదైంది. ఏసీబీ ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసింది. ఇందులో రూ. 571 కోట్ల సీసీటీవీ ప్రాజెక్టులో 16 కోట్ల జరిమానా మాఫీ చేసేందుకు రూ. 7 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించింది. 2019లో 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1.4 లక్షల సీసీటీవీ కెమెరాలను రూ. 571 కోట్లతో ఏర్పాటు చేసేందుకు బీఈఎల్​, కాంట్రాక్టర్లకు అప్పగించారు. సకాలంలో పనిపూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం జరిమానా విధించింది. అనంతరం జరిమానాను రద్దు చేసింది. రద్దు విషయంలో కాంట్రాక్టర్ల ద్వారా లంచం అందిందని ఏసీబీ ఆరోపించింది. 1988లోని సెక్షన్​ 7, 13 (1)(ఎ), ఐపీసీ సెక్షన్​ 120 బీ కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు జరిగింది. ఈ ప్రాజెక్టు అమలులో లోపాలున్నాయని గుర్తించింది. నాణ్యత లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసి మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తును ఏసీబీ ప్రారంభించింది.