అటాగ్స్ కు కేంద్రం ఆమోదం
Center approves ATAGs

రూ. 7000 కోట్లు కేటాయింపు
ప్రధానితో భద్రతా వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అటాగ్స్ (ఏటీఎజీఎస్–అడ్వాన్స్ డ్ టవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)లోని కీలకమైన ఉప వ్యవస్థల కొనుగోలుకు మోదీ ప్రభుత్వం ఒకే చెప్పింది. బుధవారం కేంద్ర కేబినెట్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నా, గురువారం మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ భేటీలో ఆమోదించారు. భారత సైన్యం కోసం రూ. 7వేల కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్ట్ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించింది. దీంతో పాక్–చైనా సరిహద్దుల్లో భద్రత మరింత పటిష్టం కానుంది. ఈ నిధులతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్ వ్యవస్థను కొనుగోలు చేయనున్నారు. ఈ అత్యాధునిక గన్ 45 కి.మీ. వరకు దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిధులతో 307 గన్ లు, 327 గన్ లను మోసే వాహనాలు కూడా కొనుగోలు చేయనున్నారు. కేంద్రం నిర్ణయంతో స్వదేశీ రక్షణ తయారీ, సాంకేతిక పురోగతికి దోహదపడనుంది. అటాగ్స్ ను రక్షణ పరిశోధన, డీఆర్డీవో, ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. 65 శాతానికి పైగా ఈ గన్ లను దేశీయంగా రూపొందించారు.