27.5 గిగావాట్లకు నెలవారీ డేటా వినియోగం
2024 డేటా వినియోగంపై సీఎజీఆర్ విడుదల

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో డేటా వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. గురువారం మొబైల్ డేటా వినియోగంపై సీఎజీఆర్ (కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్)ను నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ నివేదిక విడుదల చేసింది. 2024లో సగటు నెలలవారీ డేటా వినియోగం 27.5 గిగాబైట్ లకు పెరిగింది. ఇది గత ఐదేళ్లలో 19.5 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. సగటు మొబైల్ వినియోగదారులు గతం కంటే 12 రెట్లు డేటాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. నివాస, వ్యాపార రంగంలో డేటా వినియోగం అత్యధికంగా నమోదవుతుంది. 2026 తొలి త్రైమాసికం నాటికి 4జీ డేటాను 5జీ డేటా అధిగమిస్తుందని అంచనా వేశారు. 5జీ డేటా వినియోగం వరుసగా 3.4, 3.2 రెట్లు పెరిగింది. మెట్రో ప్రాంతాలతో 5 జీ డేటా వినియోగం 43 శాతం వాటాను దక్కించుకుంది. 2023లో 4జీ డేటా 20 శాతంగా నమోదైంది. 5జీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2025 చివరికి 90శాతం డేటా వినియోగం 5జీ సామర్థ్యం గల మొబైల్ నుంచే జరగనున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో నూతన ఆదాయ మార్గాలు, ఉపాధి సృష్టి గణనీయంగా మెరుగవుతుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం 6జీ వైపు అడుగులు వేసేందుకు మార్గం మరింత సుగమం అయినట్లవుతుంది.