దంతేవాడలో ఎన్​కౌంటర్​ ఇద్దరు మావోలు మృతి

దంతేవాడలో మరో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సలైట్లు​ మృతిచెందినట్లు డీఎస్పీ చంద్రకుమార్​ తెలిపారు.

Mar 20, 2024 - 20:34
 0
దంతేవాడలో ఎన్​కౌంటర్​ ఇద్దరు మావోలు మృతి

రాయ్​పూర్: దంతేవాడలో మరో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సలైట్లు​ మృతిచెందినట్లు డీఎస్పీ చంద్రకుమార్​ తెలిపారు. బుధవారం ఉదయం పురంగెల్​  గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, పోలీసులు యాంటి మావోయిస్టు ఆపరేషన్​లో భాగంగా సెర్చింగ్​ ఆపరేషన్​లో నిర్వహిస్తుండగా నక్సలైట్లు​ కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టులపై కాల్పులకు దిగిందన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. మృతిచెందిన వారి పేర్లు దోడీ లఖే, కేరళపాల్ ​అని తెలిపారు. వీరిద్దరి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం దంతేవాడ హెడ్​క్వార్టర్​కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సల్స్​ మృతిచెందిన విషయం తెలిసిందే.