‘సునామీ’ బీభత్సానికి 20యేళ్లు యువకుడైన ‘సునామీ’!

'Tsunami' is 20 years younger than 'Tsunami'!

Dec 26, 2024 - 13:11
 0
‘సునామీ’ బీభత్సానికి 20యేళ్లు యువకుడైన ‘సునామీ’!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సరిగ్గా 20యేళ్ల క్రితం 2004 డిసెంబర్​ 26న తమిళనాడులో సునామీ బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో ఓ నిండుగర్భిణీ తన ఆశ్రయం కోల్పోయి పురుటినొప్పులతో బాధపడుతుంది. ఎలాగోలా తన భర్త నమితారాయ్​ ను అటవీ ప్రాంతమైన కొండపైకి తీసుకువెళ్లగలిగాడు. ఫోన్లలో సిగ్నళ్లు లేవు. అంబులెన్సులు రావడం లేదు. అటవీలో ఉన్న కొందరు మహిళల సహాయంతో కాన్పు చేయగలిగాడు. నాలుగురోజులపాటు వారికి తినడానికి తిండి లేదు. తాగేందుకునీరు లేదు. ఆ శిశువుకు ప్రాణాపాయ స్థితిలో తల్లి గుండెకత్తుకొని తన పాలను అందించి బతికించుకుంది. నాలుగు రోజులు గడిచాక సహాయ బృందాలు కొండ ప్రాంతానికి వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించి తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడగలిగారు. ఆ సంఘటన ఆమె కుటుంబంపై చెరగని ముద్ర వేసింది. సర్వం కోల్పోయారు. ఆ బీభత్సానికి గుర్తుగా తన బిడ్డ పేరును ‘సునామీ’ అని పెట్టుకుంది. ఇదిగో ఆ శిశువే ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ మహిళ భర్త లక్ష్మీ నారాయణ కోవిడ్​ సమయంలో మృతి చెందాడు. ఆ చీకటి రాత్రులను గుర్తుచేసుకున్న మహిళ నమితా రాయ్​ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం నమితా రాయ్​ తన ఇద్దరు కుమారులతో పశ్చిమ బెంగాల్​ లోని హుగ్లీలో నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు సౌరభ్​ ఒక ప్రైవేట్​ షిప్పింగ్​ సంస్థలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు ‘సునామీ’ సముద్రాన్ని అన్వేషించే శాస్ర్తవేత్త కావాలని కోరుకుంటున్నాడు. ఏది ఏమైనా ఆనాటి సునామీ సృష్టించిన బీభత్సంలో 6605 మంది ప్రాణాలను కోల్పోయారు.