టిబి నియంత్రణలో పరివర్తనాత్మక పాత్ర
కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టిబి నియంత్రణలో పరివర్తనాత్మక పాత్రను కంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ప్రశంసించారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన పయనీరింగ్ సోల్యూషన్స్ టు ఎండ్ టిబిని ప్రారంభించి ప్రసంగించారు. 2024లో 26.07 లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. 2015తో పోల్చుకుంటే 17.7 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2015లో లక్ష జనాభాకు 237 టిబి కేసులు నమోదైతే 2023 నాటికి ఆ సంఖ్య 195కి తగ్గిందని, అదే సమయంలో మరణాలు 21.4 శాతం తగ్గాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో టిబి నియంత్రణలో పురోగతి సాధించామన్నారు. 2015లో మొత్తంగా 15 లక్షల కేసుల నుంచి 2023 వరకు 2.5 లక్షలకు కేసుల సంఖ్యను తగ్గించగలిగామని చెప్పారు. ఆరోగ్య పరిశోధనా విభాగం, భారత వైద్య పరిశోధనా మండలి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విభాగాలు సంయుక్తంగా పురోగతిని సాధించాయని అణుప్రియా పటేల్ స్పష్టం చేశారు.
టిబి రోగులకు పోషకాహర లోపం తగ్గించేందుకు ఎనర్జీ డెన్స్ న్యూట్రిషనల్ సపోర్ట్ ను అందజేస్తున్నామని తెలిపారు. నిక్షయ్ పోషణ్ యోజన కింద రోగులకు 2024 నుంచి నెలకు రూ. 1000 ఆర్థిక సహాయం రెట్టింపు చేశామని అనుప్రియా స్పష్టం చేశారు.