మణిపూర్​ లో సాధారణ పరిస్థితులకు కట్టుబడే చర్యలు

రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​

Mar 18, 2025 - 19:03
 0
మణిపూర్​ లో సాధారణ పరిస్థితులకు కట్టుబడే చర్యలు

ఇంఫాల్​: మణిపూర్​ లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. రాజ్యసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మణిపూర్​ బడ్జెట్​ ఆమోదం, 2025–26 ఆరు నెలలకు ఓట్​ ఆఫ్​ అకౌంట్​ పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. నిందలు వేయడం మానుకోవాలని మణిపూర్​ లో శాంతి కోసం ప్రతిపక్ష పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ప్రధాని సందర్శించలేదన్న ప్రతిపక్షాల విమర్శలను సైతం తిప్పికొట్టారు. గతంలో ప్రధానులు ఎవరైనా అక్కడ హింస జరిగితే అక్కడికి వెళ్లారా అని ప్రశ్నించారు. పీవి నరసింహారావు, ఐకె గుజ్రాల్​ పేర్లను ఉదహరించారు. మణిపూర్​ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుందని భద్రత, ఇరువర్గాలతో చర్చలు, శాంతి నెలకొల్పేందుకు పకడ్బందీ ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు చేపడుతుందని నిర్మలా సీతారామన్​ అన్నారు. అంతేగాక ఆ ప్రాంత అభివృద్ధికి కీలకమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరు శాంతి నెలకొల్పడంలో కేంద్రంతో కలిసి రావాలని అన్నారు.