కింగ్​ మేకర్​ ను ముంచిన ప్రజలు

జేఎస్​పీ ప్రశాంత్​ కిషోర్​ కు బిహార్​ లో చుక్కెదురు భవిష్యత్తు ప్రశ్నార్థకమే

Nov 23, 2024 - 15:26
 0
కింగ్​ మేకర్​ ను ముంచిన ప్రజలు

పాట్నా: రానున్న ఎన్నికల్లో తానే కింగ్​ మేకర్​ గా భావించి బిహార్​ లోని నాలుగు స్థానాల్లో పోటీకి నిలిచిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ కు తీవ్ర పరాభవం తప్పలేదు. ప్రజలు ఆయన పార్టీనీ ఏ మాత్రం గుర్తించని విధంగా ఓటింగ్​ సరళితో స్పష్టమయింది. శనివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా బిహార్​ లో జరిగిన నాలుగు స్థానాల ఉప ఎన్నికల్లో జన్​ సూరజ్​ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేక చతికిలపడింది. తారీరీలో 3, రామ్​ గర్​ లో 4, ఇమామ్​ గంజజ్​ లో 3, బెలగంజ్​ లో 3వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఉప ఎన్నికల్లో రంగంలోకి దిగిన ప్రశాంత్​ కిషోర్​ అన్ని పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములపై జోస్యం చెప్పి ఒడ్డుకు తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. కానీ తాను సొంతంగా స్థాపించుకున్న పార్టీకే జోస్యం చెప్పుకోలేక చతికిల పడడంతో ఆయన పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బిహార్​ లో కింగ్​ మేకర్​ గా నిలవాలనుకున్న ఆయన ఆశలు అడియాశలే అయ్యాయి.