బందీలను విడుదల చేయాల్సిందే
The hostages should be released
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు?
జెరూసలెం: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందంపై అమెరికా, ఇరాన్, ఖతర్ లు చేస్తున్న ప్రయత్నాలకు అనేక అడ్డంకులు ముందుకు వస్తున్నాయి. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ముందుగా బందీలందరినీ విడుదల చేస్తేనే ఒప్పందమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బెదిరిస్తున్నారని పలు దేశాల నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఐడీఎఫ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారనే ప్రకటన వెలువడింది. తమ దేశ బందీలను విడుదల చేసేందుకు హమాస్ ముందుకు వస్తే ఆలోచిస్తామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే జో బైడెన్ పదవీకాలం ముగియనుండడం, ట్రంప్ పదవీకాలం ప్రారంభం కానుండడంతో ఇజ్రాయెల్ పై యుద్ద విరమణ ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తన పాలనలో యుద్ధాలుండవని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది.
- 15 నెలల యుద్ధం..
- 2023 అక్టోబర్ 7 హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200మందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వారి మరణానికి కారణమయ్యారు. 251 మందిని బందీలుగా చేసుకున్నారు.
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 46వేల మందికిపైగా మృతి చెందారు. ఈ దాడుల్లో గాజా జనాభాలో 2 శాతం మంది మరణించారు. 50వేల మంది పిల్లలు పోషకాహారం లేక విలవిల్లాడుతున్నారు.
- గాజా వ్యవస్థ కుప్పకూలింది. 90 శాతం భవనాలు, ఇళ్లు, వ్యవస్థ నేలమట్టమైంది.
- హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలు..
- 251 మందిని బందీలుగా చేసుకోగా అందులో 157 మంది విడుదలయ్యారు. 109మందిని హమాస్ విడుదల చేయగా, ఐడీఎఫ్ సైన్యం 8 మందిని కాపాడింది. 37 మంది చనిపోయారు. మరో ముగ్గురు తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హమాస్ వద్ద మొత్తం 94 మంది బందీలున్నారని భావిస్తున్నారు. వీరిలో 60 మంది ప్రాణాలతో ఉండగా 34 మంది మృతి చెందారు.