అమల్లోకి సుంకాల నిర్ణయం కెనడా, మెక్సికో, చైనాల భారం
The decision to put tariffs into effect is the burden of Canada, Mexico and China

వాషింగ్టన్: కెనడా, మెక్సికోపై ట్రంప్ విధించిన సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సరిహద్దు వివాదాలు, డ్రగ్స్ సరఫరా, పలు రకాల ఉత్ర్పేరకాల మందుల సరఫరాతో ఏటా అమెరికాలో 75వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపులో వెనుక్కు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ సుంకాల ప్రకటనపై కట్టుబడి ఉన్నారు. దీంతో మంగళవారం ఈ ఇరుదేశాలే గాకుండా చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై కూడా సుంకాల భారం పడనుంది. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం నుంచి 20 శాతానికి సుంకాలను పెంచారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ఈ నాలుగు దేశాల స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. ముఖ్యంగా అమెరికన్ స్టాక్ మార్కెట్ 2శాతం మేర దిగజారింది.
కాగా అమెరికాకు చెందిన దిగుమతులపైన తాము 25 శాతం సుంకాలు విధిస్తామని కెనడా ప్రాని జస్టిన్ ట్రూడో నిర్ణయించారు. 30 బిలియన్ల విలువైన దిగుమతులై మంగళవారం సుంకాలు విధించామన్నారు. ఇకపై అమెరికన్ దిగుమతులపై యథాతథంగా సుంకాలు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.