లాజిస్టిక్​, గిడ్డంగుల రంగంలో వేగవంతమైన అభివృద్ధి

Rapid development in logistics and warehousing sector

Mar 4, 2025 - 13:52
 0
లాజిస్టిక్​, గిడ్డంగుల రంగంలో వేగవంతమైన అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వ సరళీకృత విధానాలతో సాధ్యం
2047 వరకు 30 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపకల్పన

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​ లాజిస్టిక్​, గిడ్డంగుల రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం విధానాలు ఈ రంగం బలోపేతానికి, అభివృద్ధికి మరింత ఊతం ఇస్తున్నాయి. 

టైర్​–1, 2, 3 నగరాల్లో వేగవంతమైన చర్యలు..
దేశంలో టైర్​ 1 నగరాలు ఈ రంగంలో కీలక కేంద్రాలుగా ఉన్నప్పటికీ మరో 12 టైర్​ 2 నగరాల్లో కూడా మార్కెట్​ వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఆన్​ లైన్​ కొనుగోళ్లు వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 459 టైర్​ 2 నగరాలు, 580 టైర్​ 3 నగరాల్లో లాజిస్టిక్​ రంగాన్ని మరింత బలపరిచేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం అర్బన్​ ఇన్​ ఫ్రాస్ర్టక్చర్​ డెవలప్​ మెంట్​ ఫండ్​ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయి. 2047 వరకు భారత్​ ను 30 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విజన్​ ప్రకారం పనిచేస్తుంది. 

ప్రైవేట్​ రంగానికి పీఎం గతి శక్తి ప్రోత్సాహం..
మరోవైపు లాజిస్టిక్స్​, గిడ్డంగుల కోసం భారత్​ లోని ప్రధాన నగరాల్లో పెద్ద స్థలాలకు భారీ డిమాండ్​ ఏర్పడుతుంది. పారిశ్రామిక షెడ్​ లు, గిడ్డంగులకు 30 నుంచి 40 మిలియన్​ చదరపు అడుగులకు చేరుకుంటుంది. ఇది గతంలో కంటే పది రెట్లు ఎక్కువగా వ్యాపార నిపుణులు అభివర్ణిస్తున్నారు. పీఎం గతిశక్తి డిజిటల్​ మౌలిక సదుపాయాల కల్పన, డేటా మ్యాపింగ్​ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రైవేట్​ రంగం భారత మార్కెట్​ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంది. దీంతో దేశీయ సామర్థ్యం పెరుగుతుంది. 

లాజిస్టిక్స్​ సూచికలో ఆరు స్థానాలు పైకి..
2023లో దాదాపు 3.7 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ అవతరించింది. 2015, 2019 మధ్య వేగంగా అభివృద్ధి చెందింది. ఏటా సగటున 7శాతం కంటే ఎక్కువ. అయితే, కఠినమైన కోవిడ్​ -ప్రేరిత లాక్‌డౌన్ కారణంగా, 2020లో జీడీపీ 7.3శాతం తగ్గింది. సేవా రంగం పునరాగమనం, తయారీ రంగం పునరుద్ధరణ, వ్యవసాయ వృద్ధి 2021, 2022లో బలమైన కోలుకోవడానికి దోహదపడ్డాయి. ఫలితంగా 2020–-22లో 15.3శాతం వృద్ధిని సాధించింది. 2022లో జీడీపీలో 15.3శాతం వాటాను కలిగి ఉంది. గత ఐదు సంవత్సరాలలో భారతదేశం వివిధ ప్రపంచ తయారీ పనితీరు సూచికలు, లాజిస్టిక్స్, వ్యాపార సౌలభ్యంపై తన ర్యాంకింగ్‌ను స్థిరంగా మెరుగుపరుచుకుంది. లాజిస్టిక్స్ పనితీరు సూచికలో 139 దేశాలలో ఆరు స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకుంది.

రవాణా ఖర్చుల తగ్గింపునకు చర్యలు..
భారతదేశంలో చాలా సరుకు రవాణా రోడ్డు రవాణాపై ఆధారపడి ఉండటం వల్లనే ఖర్చు పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కిలోమీటర్లలో 66శాతం కార్గో, రైలు రవాణా 31శాతం, షిప్పింగ్, వాయు రవాణా వరుసగా 3శాతం, 1 శాతం ఉన్నాయి. కాగా సరుకు రవాణా రంగాల వారీగా మారుతూ ఉంటుంది. జాతీయ రహదారుల అనుసంధానం, మల్టీ మోడల్​ లాజిస్టిక్​ పార్కుల అభివృద్ధి, గిడ్డంగులు, కోల్డ్​ స్టోరేజీలలో అత్యంత ఆధునిక సౌకర్యాల కల్పన, నిల్వ సమస్యల పరిష్కారంతో సరుకు రవాణా ఖర్చును భారీగా తగ్గిస్తూనే గిడ్డంగి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం తగ్గించగలుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్​ లాజిస్టిక్​ పార్కులు స్థాపించారు. ఒక్క మల్టీ మోడల్​ లాజిస్టిక్​ పార్కు వంద ఎకరాల్లో విస్తరించింది ఉంటుంది. సరుకు రవాణా మెరుగు కోసం డిజిటల్​ ఫ్లాట్​ పారమ్​ ల ద్వారా ‘వాహన్​, ఎం పరివాహన్​’ లాంటి డ్రైవింగ్​ సేవలను సులభతరం చేసింది. దీంతో లాజిస్టిక్స్​ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. ఈ వే బిల్లు వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో  సమయం ఆదా కానుంది. ప్రముఖ గ్లోబల్​ కన్సల్గింగ్​ సంస్థ అంచనా ప్రకారం భారత్​ లో లాజిస్టిక్​, గిడ్డంగుల రంగం పెద్ద ఎత్తున విస్తరిస్తుందని, 2027 నాటికి 591 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.