సైఫ్​ పై దాడి షరీఫుల్​ పనే

ఫేస్​ రికగ్నైజేషన్​ పరీక్షలో వెల్లడి

Feb 6, 2025 - 17:50
 0
సైఫ్​ పై దాడి షరీఫుల్​ పనే

ముంబాయి: ఎట్టకేలకు సైఫ్​ పై దాడి చేసింది బంగ్లాకు చెందిన షరీఫుల్​ ఇస్లామేనని ఇద్దరు గుర్తించారు. దీంతోపాటు అతని ఫేస్​ రికగ్నైజేషన్​ పరీక్షలో కూడా కెమెరాలో రికార్డయ్యింది, ఇతను ఒక్కటేనని నిర్ధారణ అయ్యిందని గురువారం పోలీసులు తెలిపారు. దాడి జరిగిన మూడు రోజుల తరువాత షరీఫుల్​ ను అరెస్టు చేశారు. సైఫ్​ ఇంట్లో పలువురు పనిమనుషుల విచారణ సందర్భంగా నిందితుడిని గుర్తించే ప్రక్రియను కూడా చేపట్టారు. ఇద్దరు పనిమనుషులు దాడికి పాల్పడింది ఇతడేనని నిర్ధారించారని చెప్పారు. దీంతో వేలిముద్రలపై విభిన్న వార్తలు, సైఫ్​ పై దాడికి పాల్పడిందే ఇతడేనా కాదా? అన్నదానికి పూర్తిగా ఫుల్​ స్టాప్​ పడిందన్నారు. ముఖ గుర్తింపుతో పాటు, సంఘటన జరిగిన సమయంలో నిందితుడు ధరించిన దుస్తులు, ఆయుధాలు, పరికరాలు, ఒక టవల్, ఒక బ్యాగ్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పోలీసులు పంపారు.