అసోంకు పెట్టుబడుల వరద
More of investments to Assam

డీస్ఫూర్: అడ్వాంటేజ్ అసోం సమ్మిట్ –2025లో పెట్టుబడుల వరద పారింది. అంతేగాక అదానీ, అంబానీ గ్రూప్ సహా పలుప్రముఖ వ్యాపార వేత్తలు కూడా భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చారు. దీంతో అసోం పంట పండింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయా సంస్థలు పెట్టుబడుల వరదలను పారించాయి.
అదానీ గ్రూప్ సంస్థ రూ. 50వేల కోట్లు, రిలయన్స్ సంస్థ రూ. 50వేల కోట్లు, టాటా గ్రూప్ రూ. 25వేల కోట్లు, వేదాంత గ్రూప్ రూ. 50వేల కోట్లు పెట్టుబడులను ప్రకటించాయి. ఈ బడా సంస్థలతోపాటు అనేక చిన్న సంస్థలు కూడా పెట్టుబడులను ప్రకటించాయి.
అదానీ గ్రూప్ (గౌతమ్ అదానీ) విమానాశ్రయాలు, ఏరోసిటీ, సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ నెట్ వర్క్, విద్యుత్ ప్రసారం, సిమెంట్, రోడ్డు నిర్మాణం రంగాలలో పెట్టుబడులను పెట్టనుంది. రిలయన్స్ గ్రూప్ (ముఖేష్ అంబానీ) అసోం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, గ్రీన్, న్యూక్లియర్ ఎనర్టీలలో పెట్టుబడులను ప్రకటించింది. వేదాంత గ్రూప్ (అనిల్ అగర్వాల్) చమురు, గ్యాస్ లలో పెట్టుబడులను ప్రకటించింది. ఇక టాటా గ్రూప్ (నటరాజన్ చంద్రశేఖరన్) ఎలక్ర్టానిక్స్ తయారీ యూనిట్, గ్రీన్ ఎనర్జీ, సోలార్ పై కప్పులు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను పెట్టనుంది. తన పెట్టుబడుల ద్వారా అసోంలో టాటా గ్రూప్ 55వేల మందికి ఉపాధి కల్పించనుంది. అదే సమయంలో రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి 17 క్యాన్సర్ కేర్ ఆసుపత్రులను నిర్వహించనుంది.