ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్
నా తెలంగాణ, మహాదేవపూర్: తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఎస్ఐ భవాని సేన్ జాతీయ జండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పోలీస్ సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ స్నేహపూర్వక పోలీసింగ్ తో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో పాటు, విధుల పట్ల అంకిత భావంతో, మరింత బాధ్యతతో పని చేసి గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కనకయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.