యుద్ధం దిశగా తాలిబాన్, పాక్ అడుగులు
Taliban and Pakistan steps towards war
సరిహద్దుల్లో భారీగా దళాల మోహరింపు
తాలిబాన్: తాలిబాన్, పాక్ మధ్య యుద్ధం మొదలు కానుంది. పాకిస్థాన్ వైమానిక దాడిలో మృతిచెందిన 46 మంది మృతి చెందారు. ఇదే తాలిబాన్ ఆగ్రహానికి కారణమైంది. పాక్ సరిహద్దు వైపు భారీ ఎత్తున తాలిబాన్ దళాలు కదులుతున్నాయి. వీరి వెంట భారీ ఆయుధాలను కూడా తీసుకువెళ్లడం యుద్ధం తప్పదనే తెలుస్తుంది. మరోవైపు పాక్ కూడా తన భద్రతా బలగాలను సరిహద్దు ప్రాంతంలో మోహరిస్తుంది. 15వేల మంది తాలిబాన్ దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పాక్ సైన్యం ఇప్పటికే ఆఫ్ఘన్ సరిహద్దుకు చేరుకోగా తాలిబాన్ దళాలు మీర్ అలీ సరిహద్దుకు చేరుకున్నాయి. మరోవైపు ఈ పరిస్థితిని ఇరుదేశాల విదేశాంగ శాఖలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కాగా తాలిబాన్ ల వద్ద ఏకే–47, మోర్టార్లు, రాకెట్ లాంచర్లు వంటి భారీ ఆయుధాలను తీసుకొని సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఒకవేళ ఆఫ్ఘన్, పాక్ మధ్య యుద్ధం జరిగితే ఈ పరిణామం పాక్ ను మరింత ఆర్థిక అగాధంలోకి నెడుతుంది. ఈ పరిణామాలు కాస్త పీఎం షెహబాజ్ షరీఫ్ కు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కాగా తాలిబానీయులు ఎవరికీ తలవంచరన్నది ప్రపంచానికి తెలిసిందే. సుదీర్ఘకాలం ఆఫ్ఘన్ లో ఉన్న అమెరికా సైన్యం చివరకు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లింది. అమెరికా సైన్యం అటు వెళ్లగానే ఇటు తాలిబాన్ ఆఫ్ఘన్ ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.