సంభాల్ మసీదు ముందు పోలీస్ స్టేషన్
Police station in front of Sambhal Masjid
లక్నో: సంభాల్ లోని జామా మసీదు ముందు పోలీస్ పోస్ట్ ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. మసీదు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని అడిషనల్ ఎస్పీ, సీఓ శ్రీచంద్ర స్థలాన్ని పరిశీలించి నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. భద్రత దృష్ట్యా ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో ఈ స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపడతామన్నారు. కాగా సంభాల్ హింసలు ఇప్పటివరకు 91 మందిని గుర్తించినట్లు తెలిపారు. మసీదు సర్వేలో రోజుకో కొత్త కోణం కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయం బయట బావి, ఆలయం ఉండగా, లోపల మరో మెట్ల బావిని గుర్తించారు. బావిలో నుంచి మట్టిని తీసే పనికి ఉపక్రమించారు.