హమాస్​ పై భీకర దాడులు.. 326 మంది మృతి!

Fierce attacks on Hamas.. 326 people killed!

Mar 18, 2025 - 13:58
 0
హమాస్​ పై భీకర దాడులు.. 326 మంది మృతి!

గాజా సిటీ: ఇజ్రాయెల్​ మరోమారు గాజాలో హమాస్​ స్థావరాలపై విరుచుకుపడింది. మంగళవారం వేకువజామున భారీ వైమానిక దాడులను చేసింది. ఈ దాడుల్లో 326 మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగించనందున, తమ బందీలను విడిచిపెట్టినందున హమాస్​ నరకపు తలుపులను మరోమారు తెరుస్తామని ఇజ్రాయెల్​ రక్షణ శాఖ మంత్రి కాట్జ్​ హెచ్చరించారు. జనవరి 19న కాల్పుల విరమణ తరువాత ఐడీఎఫ్​ గాజాలో చేపట్టిన అతిపెద్ద దాడి ఇదే. అంతేగాక గత వారం రోజులుగా గాజాకు ఆహారం, మందులు, ఇంధనం, సామాగ్రి సరఫరాను కూడా ఇజ్రాయెల్​ నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను హమాస్​ అంగీకరించాలని డిమాండ్​ చేస్తుంది. కాగా దాడులపై గాజా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గాజాలోని ఖాన్​ యూనిస్​ శరణార్థి శిబిరం మంటల్లో చిక్కుకుందన్నారు. కాగా ఈ దాడులను హమాస్​ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య కాల్పుల విరమణ కిందకే వస్తుందని, పైగా ఇజ్రాయెల్​ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని, రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతున్నారని హమాస్​ హెచ్చరించింది. 

కాగా తొలిదశ కాల్పుల విరమణలో భాగంగా 33 మంది ఇజ్రాయెల్​ బందీలను హమాస్​ విడుదల చేయగా, రెండువేల మంది బందీలను ఇజ్రాయెల్​ విడుదల చేసింది. మార్చి 1న కాల్పుల విరమణ ముగిసింది. ఇంకా 59 మంది బందీలు హమాస్​ వద్ద ఉన్నారని, అందులో 24 మంది బతికే ఉన్నారని ఇజ్రాయెల్​ వాదిస్తోంది. దీంతో పలుమార్లు బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ కూడా హెచ్చరించారు. అంతేగాక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ కూడా హమాస్​ కు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడు. 

కాగా ఇజ్రాయెల్​ దాడులతో మరోమారు భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు గాజాను వీడి వెళుతున్నారు.