సునీతా క్షేమంగా తిరిగి రావాలి

ప్రధాని మోదీ లేఖ

Mar 18, 2025 - 15:14
 0
సునీతా క్షేమంగా తిరిగి రావాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత కుమార్తె సునీతా విలియమ్స్​ క్షేమంగా తిరిగి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మంగళవారం అంతరిక్ష కేంద్రం ఐఎస్​ఐఎస్​ ను నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్​ కోసం ప్రపంచం ఎదురుచూచ్తుందని ఆమెకు లేఖ పంపారు. ఈ లేఖను వ్యోమగామి మైక్​ మాసిమినో సునీతా విలియమ్స్​ కు పంపారు. ఈ లేఖలో ప్రధాని భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్​, బైడెన్​ లను కలిసినప్పుడు కూడా సునీతా శ్రేయస్సు కోసం ప్రార్థించాను విచారించానని తెలిపారు. ఈ విజయం పట్ల భారత్​ లోని 140 కోట్ల మంది ప్రజలు ఎల్లవేళలా గర్వంగా భావిస్తారని చెప్పారు. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మా హృదయాలకు దగ్గరగానే ఉన్నారని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. మిషన్​ విజయం, ఆరోగ్యం కోసం ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. 2016లో అమెరికా పర్యటనలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే భారత్​ కు కూడా రావాలని ఆకాంక్షించారు. తమదేశ కూతురికి ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషకరమని చెప్పారు. సునీతా విలియమ్స్​ తోపాటు బుచ్​ విల్మర్​ కూడా సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.