మరో కీలక ఘట్టానికి అయోధ్య ముస్తాబు

Ayodhya is set for another crucial event

Mar 18, 2025 - 14:16
 0
మరో కీలక ఘట్టానికి అయోధ్య ముస్తాబు

లక్నో: అయోధ్య రామాలయం మరో కీలక ఘట్టానికి ముస్తాబవుతోంది. అయోధ్య రామజన్మభూమి సముదాయంలో ఒకటో అంతస్థులో పాలరాతితో కూడిన అద్భుతమైన సింహాసనం రూపుదిద్దుకుంది. ఈ విషయాన్ని మంగళవారం ఆలయ ట్రస్టుపలు చిత్రాలను విడుదల చేసింది.  శ్రీ రామ నవమికి ముందే పనులన్నీ పూర్తి చేసుకొని వివిధ దేవుళ్ల విగ్రహాలను ఇక్కడ నెలకొల్పనున్నారు. ఏప్రిల్​ 30న సముదాయంలో నిర్మించే 14 చిన్న చిన్న దేవాలయాల్లో ఆయా విగ్రహాలను స్థాపించనున్నారు. ముందుభాగంలో మండపం, అద్భుతమైన శిల్పాలు, జైపూర్​ గులాబీ ఇసుకరాయితో రూపొందించారు. విగ్రహాల ప్రతిష్ఠ (అక్షయ తృతీయ) ఏప్రిల్​ 20, ప్రాణ ప్రతిష్ఠ జూన్​ 5 (గంగా దసరా)గా నిర్ణయించారు. అయితే ఈ తేదీలపై ఇంకా ట్రస్టు ఆమోదం లభించలేదు. 
ఏప్రిల్​ 30 కంటే ముందే రాజస్థాన్​ లో తయారు చేసిన విగ్రహాలు అయోధ్యకు చేరుకుంటాయి. సూర్యుడు, వినాయకుడు, హనుమంతుడు, శివుడు, భగవతి దేవి, అన్నపూర్ణదేవి విగ్రహాలను నెలకొల్పనున్నారు. ఇదేగాకుండా సప్తమండపంలో ఏడు ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో వాల్మీకి, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు, నిషాదరాజు, అహల్య, శబరి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ఇప్పటికే నిర్వహించిన సమావేశంలో ఆయా తేదీలను నిర్ణయించింది. ఆమోదం లభించాల్సి ఉంది.