లక్నో: సంభాల్ హింస వెనుక మౌలానాల హస్తం ఉందని, దోషులప ఎన్ఎస్ ఎ విధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హింసాకాండలో జరిగిన నష్టానికి వీరినే బాధ్యులను చేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వీహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ సోమవారం డిమాండ్ చేశారు. ముస్లిం ఛాందసవాదులు భద్రతలో ఉన్న పోలీసులపై దాడి, కాల్పులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ హింసకు రాహుల్ గాంధీ సహా ముస్లిం నాయకులు, ఎస్పీ నాయకులు, మౌలానాలు మద్ధతు తెలుపుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. సీఐ, ఎస్పీలపై సైతం దుండగులు కాల్పులు జరపగా 22 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని వారికి మద్ధతు ఎందుకు తెలపడం లేదని వీహెచ్ పీ నిలదీసింది.
డీఐజీ విజ్ఞప్తి..
ఇద్దరు మహిళలతో సహా హింసకు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశామని డీఐజీ మునిరాజ్ తెలిపారు. ఇది కాకుండా, 400 మందికి పైగా గుర్తుతెలియని, పేరున్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పౌరులందరూ శాంతిని కాపాడాలని, పుకార్లకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.