సిద్దిఖీ హత్య నిందితుడి పరారీ
Siddiqui murder accused absconds

ముంబాయి: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని హత్య చేసిన నిందితుడు జీషన్ అక్తర్ విదేశాలకు పారిపోయాడు. అక్కడి నుంచి గురువారం విడుదల చేసిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఇతను పారిపోయేందుకు పాక్ లోని ఉన్న మాఫియా డాన్ ఫరూఖ్ ఖోఖర్ సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక నెల క్రితం వరకు అతన్ని పోలీసులు ట్రాక్ చేసేందుక ప్రయత్నించగా అతని సెల్ ఫోన్ సిగ్నల్ నేపాల్ లో చూపెట్టింది. అయితే ఆ మొబైల్ వాడుతున్నది అతనేనా కాదా? అన్న విషయంలో స్పష్టత లేదన్నారు. వీడియో విడుదలలో జీషన్ పలువురికి హెచ్చరికలు జారీ చేశాడు. తాను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లగలనన్నాడు. అక్టోబర్ 12న రాత్రి బాబా సిద్దిఖీని కాల్చి చంపిన కేసులో ఇతనే ప్రధాన నిందితుడు.