అరుణాచల్, మిజోరం అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

నా తెలంగాణ, న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. వారసత్వం, సాంస్కృత్రిక సంప్రదాయాలను ప్రశంసించారు. ఈ రాష్ర్టాల ప్రజలు అద్భుతమైన అభివృద్ధిని సాధించాలని కోరుకున్నారు. ఉదయించే సూర్యుని భూమి అరుణాచల్ ప్రదేశ్ గుర్తింపు పొందిందని, ఇక్కడి ప్రజల ఐక్యతలను కొనియాడారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మన గత స్మృతులను, వర్తమానాలను గౌరవించుకోవాలన్నారు. భవిష్యత్ లో దేశ యువత వీటి ద్వారా గుణపాఠాలను నేర్చుకొని వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.