రూ. 8,08,736 కోట్లతో యూపీ బడ్జెట్​

Rs. UP budget with Rs 8,08,736 crore

Feb 20, 2025 - 13:12
 0
రూ. 8,08,736 కోట్లతో యూపీ బడ్జెట్​

విద్యార్థులకు స్కూటీలు, స్మార్ట్​ ఫోన్లు
ఆడపిల్ల వివాహానికి రూ. 61వేలు
పట్టణ, గ్రామీణ రహదారుల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం

లక్నో: యూపీ 2025–26 బడ్జెట్​ ను అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి సురేష్​ ఖన్నా రూ. 8,08,736 లక్షల కోట్ల బడ్జెట్​ ను ప్రకటించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 9.8 శాతం ఎక్కువగా బడ్జెట్​ ను ప్రకటించారు. ఇందులో మూలధన వ్యయం 20.5 శాతం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి 22 శాతం, విద్యకు 13 శాతం, వ్యవసాయం, సంబంధిత సేవలకు 11 శాతం, వైద్యం, ఆరోగ్యానికి 6 శాతం, సామాజిక భద్రతా కార్యక్రమాలకు 4 శాతం కేటాయించారు. ఐటీ, బాలిక విద్యకు ప్రోత్సాహం, హస్టళ్ల నిర్మాణం, ఉన్నత విద్య, విద్యార్థులకు స్కూటీలు అందించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఆడపిల్ల వివాహానికి రూ. 61వేలను ప్రకటించారు. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ పథకం కింద రూ. 49.86 లక్షల స్మార్ట్​ ఫోన్లు/టాబ్లెట్లు పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధితో అనుసంధానిస్తామని ఆర్థిక శాఖ మంత్రి సురేష్​ ఖన్నా స్పష్టం చేశారు. సీఎం యువ ఉద్యమి వికాస్​ అభియాన్​ కు రూ. 1000 కోట్లు కేటాయించారు. సీఎం యువ స్వయం ఉపాధికి రూ. 225 కోట్లు టెక్స్​ టైల్​ పార్కు ఏర్పాటుకు రూ. 300 కోట్లు, టెక్స్​ టైల్​ గార్మెంటింగ్​ పాలసీ కింద రూ. 150 కోట్లు, అటల్​ బిహార్​ వాజ్​ పేయి పవర్​ లూమ్​ విద్యుత్​ ప్లాట్​ రేట్​ పథకానికి రూ. 400 కోట్లు, సీఎం గ్రామోద్యోగ్​ రోజ్​ గార్​ పథకానికి రూ. 16వేల మందికి ఉపాధి, 800మందికి బ్యాంకు రుణాలు, రోడ్ల వెడల్పు కోసం రూ. 200 కోట్లు, వంతెనలు, అండర్​ పాస్​ లకు రూ. 1450 కోట్లు, రహదారుల విస్తరణకు రూ. 2900 కోట్లు, రోడ్ల నిర్వహణకు మరో రూ. 3000 కోట్లు, నిర్మాణానికి మరో రూ. 2800 కోట్లను కేటాయించారు. గ్రామీణ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ. 2700 కోట్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ. 1200 కోట్లు, లాజిస్టిక్​ పార్క్​ నిర్మాణం కోసం రూ. 800 కోట్లు, లింకు రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లను కేటాయించారు.