గుండెపోటుతో శ్రద్ధా వాకర్ తండ్రి మృతి!
Shraddha Walker's father died of a heart attack!

ముంబాయి: శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ర్టలోని వాసాయి పాల్ఘర్ నివాసంలో ఆదివారం ఉదయం ఆయన మృతి చెందాడు. తన కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు. శ్రద్ధా వాకర్ హత్య కేసును ఈయనే వాదిస్తున్నాడు. వాకర్ కుటుంబం 2022లో ఆమె హత్య తరువాత న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అఫ్తాబ్ పూనావాలా ఉన్నాడు. 2022లో శ్రద్ధా వాకర్ ను అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా కోసి హత్య చేశాడు. ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా లారెన్స్ బిష్ణోయ్ అఫ్తాబ్ ను హత్య చేసే అవకాశం ఉన్నట్లు కూడా పలుమార్లు ఆరోపణలు వినిపించాయి. వికాస్ వాకర్ అదే జరగాలని ఆకాంక్షించాడు. తన కూతురి మృతదేహాన్ని సైతం చూసుకోనీయకుండా అత్యంత దారుణంగా చంపిన అఫ్తాబ్ ను ఉరికంబం ఎక్కించాలనే ఉద్దేశ్యంతోనే తానే స్వయంగా కేసును వాదిస్తున్నట్లు పలుమార్లు మీడియాతో కూడా చెప్పాడు. 2022 మే 18 జరిగిన ఈ హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.