లక్ష్యాల పూర్తిలో ఆమె కీలకం

ప్రధాని నరేంద్ర మోదీ

Mar 7, 2025 - 17:32
 0
లక్ష్యాల పూర్తిలో ఆమె కీలకం

తల్లులకు, సోదరీమణులకు వందనం
రూ. 2,850 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
సంపూర్ణ ఆరోగ్యంతోనే లక్ష్యాల సాధన పరిపూర్ణం

గాంధీనగర్​: కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి చేస్తున్న ప్రతీ ప్రయత్నంలోనూ మహిళా శక్తి పాత్ర కీలకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. లక్పతీ దీదీ, భేటీ బచావో.. భేటీ పడావో, సెల్ఫ్​ హెల్ఫ్​ సంగాలు, స్టార్టప్​ లు, సాంకేతిక రంగం, విమానయాన, కథన  రంగం ఇలా ప్రతీ రంగంలోనూ ప్రభుత్వం లక్ష్యాలు పూర్తి చేయడంలో మహిళల పాత్ర అభినందనీయమని ఆ తల్లులకు, సోదరీమణులకు, ఆడబిడ్డలకు వందనం సమర్పించారు. 

అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం..
శుక్రవారం దాద్రా, నగర్​ హవేలీ, డామన్​, డయ్యూ సిల్వాసా పలు ప్రాంతాల్లో పర్యటించారు. సిల్వాసాలోని నమో ఆసుపత్రి 450 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. సిల్వాసా అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రూ. 2,850 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్య, వెల్నెస్​ కేంద్రాలు, పంచాయితీ, పరిపాలనా భవనాలు,అంగన్​ వాడీ కేంద్రాలు, నీటి సరఫరా, డ్రైనేజీలు వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రాజెక్టులు మెరుగుపర్చడంతో ఈ ప్రాంతానికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. పారిశ్రామికంగానూ ఈ ప్రాంతం మరింత అభివృద్ధిని సాధించనుంది. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. 

సిల్వాస దీదీ పథకం ప్రారంభం..
ఉద్యోగమేళాలో నియామక పత్రాలను ప్రధాని అందించారు. పీఎం ఆవాస్​ యోజన అర్బన్​, గిర్​ ఆదర్శ్​ అజీవిక పథకం, సిల్వాస​ దీదీ పథకాల ప్రయోజనాలను అందజేశారు. మహిళా కార్మికులకు సిల్వాస​ దీదీ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. సూరత్​ లో ఆహార భద్రత అభియాన్​ కార్యక్రమాన్ని ప్రారంభించి 2.3 లక్షలమంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలను అందించారు. 

వ్యాయామం తప్పనిసరి..
అభివృద్ధి చెందిన భారత్​ ను చూడాలంటే ముందుగా ప్రతీ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అప్పుడే మనం నిర్దేశించుకున్న పెద్ద లక్ష్యాలను అవలీలగా చేరుకోగలమని మోదీ చెప్పారు. స్థూలకాయం అనేక వ్యాధులకు కారణమవుతుందని, ప్రాణాంతకంగా మారుతుందన్నారు. ఓ సర్వే నివేదిక ప్రకారం 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడతారని దీన్ని నివారించాలన్నారు. ప్రతీరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రతీ ఆదివారం ఇంధనాన్ని ఆదా చేస్తూ సైకిల్​ చక్రాలను వాడాలన్నారు. దీంతో స్థూలకాయాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చని అన్నారు. 

25వేల జన ఔషధి కేంద్రాల ప్రారంభమే లక్ష్యం..
సిల్వాసాలో విద్య, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆరు జాతీయ పెద్ద సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం కొత్త విద్యా కేంద్రంగా మారిందని చెప్పారు. హిందీ, ఇంగ్లీష్​, గుజరాతీ, మరాఠీ భాషల బోధనకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ఇక్కడి ఆరోగ్య కేంద్రాల ద్వారా గిరిజనులకు మేలు చేకూరుతుందన్నారు. తమ ప్రభుత్వం ప్రజలపై భారం లేని వైద్య వ్యవస్థను రూపకల్పన చేసిందని, జన్​ ఔషధి కేంద్రాల ద్వారా చౌక ధరలకే మందులను అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 25వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు.