హిండెన్ బర్గ్ కేసు.. సుప్రీం తిరస్కరణ
పిటిషనర్ కు చీవాట్లు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టులో హిండెన్ బర్గ్ కేసుపై విచారణ జరగాలని పిటిషన్ దాఖలుపై పిటిషనర్ కు సుప్రీం చీవాట్లు పెట్టింది. జరిమానా ఎవరికి విధించాలని, సంస్థనే మూసివేస్తున్నట్లుగా ప్రకటించగా ఎలా విచారించాలని పిటిషనర్ ను నిలదీసింది. పిటిషన్ ను విచారించబోమని తిరస్కరించింది. సోమవారం పిటిషన్ సుప్రీంలో విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పిటిషనర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆగస్టు 5న కూడా ఈయన దరఖాస్తును సుప్రీంకోర్టు రిజిస్ర్టార్ నిరాకరించారు. దీంతో హిండెన్ బర్గ్ ను అడ్డుపెట్టుకొని దేశంలోని పలు పార్టీలు అదానీ సంస్థపై చేస్తున్న రాజకీయ ఆరోపణలకు తెరపడినట్లయ్యింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లుగా వ్యవస్థాపకుడు అండర్సన్ ఇటీవలే ప్రకటించారు.