కాశీ, అయోధ్య.. ఇక మధుర వంతు!

సీఎం యోగి ఆదిత్యనాథ్​ 

Mar 7, 2025 - 18:08
Mar 7, 2025 - 18:09
 0
కాశీ, అయోధ్య.. ఇక మధుర వంతు!

లక్నో: కాశీ, అయోధ్య తరువాత ఇప్పుడు మధుర వంతు వచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. శుక్రవారం మధురలో పర్యటించిన యోగి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత హోలి సంబురాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అయోధ్య, ప్రయాగ్​ రాజ్​ వలె మధుర, బృందావన్​, బర్సానా,గోకుల్​, గోవర్దన్​, బలదేవ్​ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఐదువేల సంవత్సరాలుగా సనాతన సంస్కృతికి శక్తినిస్తున్న  బ్రజ్​ భూమి భక్తి, విశ్వాసాలకు నిలయమన్నారు. ఉత్తరప్రదేశ్​ లోనే ఈ మూడు తీర్థ స్థానాలు ఉండడం అదృష్టమన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, పుకార్లను వ్యాపింప చేసినా వారికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ ఏడాది బడ్జెట్​ లో బర్సానాలో రోప్​ వే సౌకర్యం ప్రారంభిస్తామని చెప్పారు.