సంబురాలపై దాడులు.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం

Attacks on Sambura...BJP is angry with TMC

Mar 15, 2025 - 18:44
 0
సంబురాలపై దాడులు.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ హోళీ సంబురాల్లో దాడులపై ఆ రాష్ర్ట ప్రభుత్వం హింసను దాచి పెడుతుందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సుకాంత మజుందార్​, మరో నాయకుడు సువేందు అధికారిలు ఆరోపించారు. శుక్రవారం హోళీ సంబురాల సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు, రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో టీఎంసీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్​ ను కూడా నిలిపివేసి ఈ ఘటనను బయటి ప్రపంచానికి తెలియనీయడం లేదని వీరు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. బెంగాల్​ బీర్బూమిలో ఇంటర్నెట్​ షట్​ డౌన్​ ఎందుకు చేశారని నిలదీశారు. బీర్బూమిలోని సైంథియా ప్రాంతంలో ఐదు గ్రామ పంచాయితీ ప్రాంతాలలో ఈ గొడవలు మరింత ముదరడంతో ప్రభుత్వం ఇంటర్నెట్​ ను నిలిపివేసిందన్నారు. అంతపెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు విధించడంపై ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయడం లేదని మండిపడ్డారు. సాధారణ స్థితిని తేలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. వెంటనే బెంగాల్​ గవర్నర్​ కల్పించుకొని ప్రభుత్వంతో నివేదిక కోరి తగిన చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు కోరారు. మమత బెనర్జీ పరిపాలనలో పోలీసులు నిష్ర్కియాత్మకంగా మారారని విమర్శించారు.