ప్రాంతీయ శాంతికి అడ్డంకి పాక్​

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​

Mar 18, 2025 - 20:31
 0
ప్రాంతీయ శాంతికి అడ్డంకి పాక్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రాంతీయ శాంతికి పాకిస్థాన్​ అతిపెద్ద అడ్డంకి అని వెంటనే భారత భూభాగాలను ఖాళీ చేయాలని భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ డిమండ్​ చేశారు. ప్రధానమంత్రి పాడ్​ కాస్ట్​ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలపై పాక్​ స్పందనపై మండిపడ్డారు. మంగళవారం ఆయన ప్రకటన విడుదలలో పాక్​ ను తూర్పారబట్టారు.

పాకిస్థాన్​ ఒక ఉగ్రవాద దేశమని, చట్టవిరుద్ధంగా భారత భూభాగాన్ని ఆక్రమించిందని, అసత్యాలు, అవాస్తవాలు వ్యాపింప చేస్తుందని మండిపడ్డారు. వెంటనే తమ భూభాగాలను ఖాళీ చేయాలని డిమాండ్​ చేశారు. జమ్మూకశ్మీర్​ పై పాక్​ వ్యాఖ్యలు పాక్​ సమస్య ఎలా అవుతుందని నిలదీశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్ధతు పలుకుతున్నదెవరో? ప్రపంచానికి తెలుసన్నారు. పాక్​ వల్ల ప్రాంతీయ శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. 

కాగా అమెరికా ఇంటలిజెన్స్​ చీఫ్​ తులసీ గబ్బర్డ్​ మీడియాతో మాట్లాడుతూ భారత్​, అమెరికాలను ప్రభావితం చేస్తున్న అనేక ఉగ్రవాద దేశాలున్నాయని అన్నారు. అవే ఇస్లామిక్​ ఉగ్రవాద దేశాలను పరోక్షంగాపాక్​ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

గతంలో తులసీ గబ్బర్డ్​ తో ప్రధానమంత్రి మోదీ సమావేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సముద్ర, సైబర్​ భద్రతలో సహకారాన్ని పెంపొందించేందుకు భారత్​–అమెరికా కట్టుబడి ఉన్నాయని అంగీకరించారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఇరుదేశాల సహకారానికి ఉన్న వివిధ అవకాశాలను ప్రధాని మోదీ గబ్బర్డ్​ తో చర్చించారు.