ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ సీఈసీ నిర్ణయం
CEC decides to link Aadhaar with voter card

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియకు సీఈసీ నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసనసభా శాఖ కార్యదర్శి సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, ఆధార్ అత్యున్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారంఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా ఆయా విషయాలపై మరిన్ని చర్చలు అవసరమని సమావేశంలో నిర్ణయించారు.
1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23, ఎన్నికల చట్టాలు (సవరణ) చట్టం 2021అని కూడా పిలుస్తారు. ఈ నిబంధన ప్రకారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి స్వచ్ఛందంగా గుర్తింపును ఆధార్ నంబర్‌ను అందించమని ఓటర్లను అడగవచ్చు. చట్టం ప్రకారం ఓటర్ల జాబితాలను ఆధార్ డేటాబేస్‌తో స్వచ్ఛందంగా అనుసంధానించవచ్చు.
కాగా ఆధార్ – ఓటరు కార్డు అనుసంధానంపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిన విషయంపై చర్చించారు. న్యాయపరంగా ముందుకు వెళ్లడంపై నివేదికు రూపొందించుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతీ పక్షాల సూచనలు, సలహాలు, వారి సందేహాల నివృత్తి చేయాలని నిర్ణయించారు. త్వరలోనే అన్ని విషయాలపై నిపుణుల సూచనలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమే అనుసంధాన ప్రక్రియ కొనసాగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మాట్లాడారు. ఓటరు ప్రతీ దేశ పౌరుడికి ఇచ్చే హక్కు, ఆధార్ కేవలం గుర్తింపు కార్డు ఈ నేపథ్యంలో ఈ రెండింటి అనుసంధానంతో ఉన్న ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో నకిలీల బెడద, సమగ్ర డేటా బేస్ రూపకల్పన జరగాలన్నారు. అయితే ఈ అంశాలన్నింటిపై ఇంకా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా 2015లో జాతీయ ఎన్నికల జాబితాను ఆధార్ తో అనుసంధానించే ప్రక్రియను పూర్తి చేశారు. కానీ సుప్రీం కోర్టు స్టే వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తొలుత చట్టపరమైన అడ్డంకులు, నిపుణుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళితే అనుసంధాన ప్రకియ సాధ్యపడుతుందని సీఈసీ నిర్ణయించింది.