ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ కుమార్తె గణేష్ చతుర్థి సందర్భంగా పూజల్లో పాల్గొన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో తీవ్ర దుమారం చెలరేగుతోంది. కరడుకట్టి ఇస్లాం వాదులకు ఈమె హిందూ దేవున్ని పూజించడం రుచించడం లేదు. దీంతో సోషల్ మీడియా పరంగా సారా అలీఖాన్ పై అనుచిత పోస్టులను చేస్తున్నారు. అంతేగాక ఆమె ఇంటి దగ్గరలోని ప్రాంతాల్లో పలు వాహనాల అద్దాలు, టూవీలర్ వాహనాల ధ్వంసానికి కూడా దుండగులు పాల్పడ్డారు. దీంతో అలర్టయిన పోలీసులు సారా అలీఖాన్ ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వివాదంపై ఆదివారం కూడా తీవ్ర ఆందోళన, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.
హిందూ దేవుళ్లపై ఆమె భక్తిని ప్రకటించింది. సారా గతంలో కేదార్ నాథ్, వైష్ణోదేవి వంటి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించింది. వినాయకుని పూజ సందర్భంగా పూర్తి కాషాయ దుస్తులను ధరించిన సారా అలీఖాన్ నుదుటన బొట్టుపెట్టుకొని విఘ్నేశ్వరునికి దండం పెడుతున్న ఫోటోలో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇది పలువురు ఇస్లామిస్టులకు నచ్చడం లేదు.