విద్యుత్ ప్లాంట్లపై విరుచుకుపడుతున్నరష్యా
Russia is cracking down on power plants
కైవ్: ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. బుధవారం ఈ విషయాన్ని ఆ దేశమంత్రి జర్మన్ గలుషెండో మాట్లాడుతూ.. ఇంధన ప్లాంట్లపై పెద్ద యెత్తున రష్యా దాడులకు పాల్పడుతుందన్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఖర్కివ్ లోనూ పేలుళ్లు జరిపారన్నారు. రష్యా వైమానిక దాడుల్లో 9మందికి గాయాలయ్యాయన్నారు. ప్లాంట్లపై దాడితో పెద్ద యెత్తున ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. కీవ్, డ్నిప్రో పెట్రోవ్, ఒడెస్సాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇది రష్యా ఎనర్జీ ప్లాంట్లపై 13వ దాడి అని తెలిపారు.