నైనిటాల్​ లో బస్సు ప్రమాదం ముగ్గురు మృతి, 25 మందికి గాయాలు

Three killed, 25 injured in bus accident in Nainital

Dec 25, 2024 - 16:00
 0
నైనిటాల్​ లో బస్సు ప్రమాదం ముగ్గురు మృతి, 25 మందికి గాయాలు

నైనిటాల్​: ఉత్తరాఖండ్​ లోని నైనిటాల్​ లో బస్సు వంద అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. 

భీమ్​ తాల్​, హల్దాన్వీ మధ్య  ఖైర్నా సమీపంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సీఎం పుష్కర్​ సింగ్​ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.