ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి విఫలయత్నం హ్యాండ్ గ్రెనేడ్ లభ్యం
మధ్యప్రదేశ్ లోని భింద్ ఆర్ఎస్ ఎస్ కార్యాలయంలో హ్యాండ్ గ్రెనేడ్ లభించడం తీవ్ర కలకలం సృష్టించింది.
భోపాల్: మధ్యప్రదేశ్ లోని భింద్ ఆర్ఎస్ ఎస్ కార్యాలయంలో హ్యాండ్ గ్రెనేడ్ లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు హ్యాండ్ గ్రెనేడ్ తో కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఆర్ఎస్ ఎస్ కార్యాలయానికి బాంబు, డాగ్ స్క్వాడ్ లతో చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా గ్రెనేడ్ లభించింది. ఈ గ్రెనేడ్ 30 నుంచి 35 ఏళ్ల క్రితం నాటిదని పోలీసులు పేర్కొన్నారు. గ్రెనేడ్ ను నిర్వీర్యం చేశామని, కార్యాలయంలోని జెండా ఎగురవేసే ప్రాంతంలో లభ్యమైందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయంపై దాడి ఆర్ఎస్ఎస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.