రూ. 0.50 నాణేం చెల్లుతుంది: ఆర్బీఐ

Rs. 0.50 coin Validity: RBI

Feb 9, 2025 - 16:48
 0
రూ. 0.50 నాణేం చెల్లుతుంది: ఆర్బీఐ

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: డిజిటల్​ చెల్లింపుల నేపథ్యంలో 0.50 పైసల నుంచి రూ. 10 కాయిన్​ ల వరకు చెల్లింపుల్లో ఆయా ప్రాంతాలు, మార్కెట్లలో పలు చోట్ల నిలుపుదల చేస్తున్నారు. ఈ నాణేలు తీసుకోవడం లేదని పేచీ పెడుతున్నారు. కానీ ఆర్బీఐ 2011 చట్టం ప్రకారం రూ. 0.50 పైసల నాణేల నుంచి రూ. 10వరకు నాణేలు చెల్లింపులో ఉన్నట్లు స్పష్టం చేసింది. అందరూ వీటిని తీసుకోవడం చేయాలని పేర్కొంది. నాణేల వినియోగంపై ఉన్న అపోహలపై సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ ఇంకా 0.50 పైసల నాణేలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో 2011 నుంచి 0.25 పైసల నాణేలను నిలుపుదల చేసినట్లు స్పష్టం చేసింది.