కులం పేరెత్తితే తంతా!: గడ్కరీ

If you name caste, it's all over!: Gadkari

Mar 16, 2025 - 12:36
 0
కులం పేరెత్తితే తంతా!: గడ్కరీ

ముంబాయి: కులం పేరు గురించి మాట్లాడితే తంతానని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాగ్​ పూర్​ మైనార్టీ సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తనకు మంత్రి పదవి లేకున్నా తన విధానాలను ఎన్నటికీ మార్చుకోబోనని చెప్పారు. తాను దృఢంగా పనిచేస్తానన్నారు. తాను కులం, మతం గురించి బహిరంగంగా మాట్లాడనని చెప్పారు. తన ఆలోచనా విధానం సామాజిక సేవే అన్నారు. కులం, మతం ఆధారంగా ఎవ్వరిపై వివక్ష చూపలేదన్నారు. రాజకీయాలు ఎన్నో రకాల అంశాలతో మేళవింపు అయి ఉన్నప్పటికీ తాను తనకు ఇష్టం వచ్చినట్లే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు ఎవరు ఓటు వేస్తారో? వేయరో? అనే ఆందోళన ఎప్పుడూ లేదన్నారు. తన పనితీరుతో ప్రజలే తనను ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో తాను ఏర్పాటు చేసుకున్న కొన్ని సూత్రాలను నిక్కచ్చిగా పాటిస్తానని గడ్కరీ వ్యాఖ్యానించారు. ముస్లిం సమాజం నుంచి ఎక్కువమంది ఉన్నత విద్యనభ్యసిస్తే అందరికీ మంచిదే అన్నారు. విద్య జీవితాలనే మార్చగలదనే దానికి మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్​ కలాం నిదర్శనమన్నారు. మానవుల జీవితాలనే మార్చే విద్య అని పునరుద్ఘాటించారు.