ఎఎంయూ నోటీసు బోర్డులో బీఫ్​ బిర్యానీ!

మండిపడ్డ బీజేపీ నాయకుడు నిషికాంత్​ శర్మ

Feb 9, 2025 - 16:30
 0
ఎఎంయూ నోటీసు బోర్డులో బీఫ్​ బిర్యానీ!

సీనియర్​ విద్యార్థుల తప్పిదమేనన్న అధికారులు

లక్నో: అలీఘర్​ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో చికెన్​ కు బదులు బీఫ్​ బిర్యానీ వడ్డిస్తామన్న నోటీసుపై పలు విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకుడు నిషికాంత్​ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సర్​ సులేమాన్​ షా హాల్​ లో నోటీసు బోర్డుపై ఆదివారం బీఫ్​ బిర్యానీ మెనును వడ్డిస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసును బోర్డులో ప్రదర్శించే అధికారం యూనివర్సిటీకి చెందిన ఇద్దరు అధికారులపై ఉంది. దీంతో విద్యార్థులు ఈ నోటీసును క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు. వివాదాస్పద నోటీసుపై బీజేపీ నాయకుడు నిషికాంత్​ శర్మ మండిపడ్డారు. నోటీసు బోర్డులో బీఫ్​ బిర్యానీ వడ్డిస్తామనడం సిగ్గు చేటన్నారు. దీనికి యూనివర్సిటీ కమిటీ బాధ్యత చేపట్టాలన్నారు. పరిపాలనా యంత్రాంగం ఇప్పటికీ చూసుకుంటూ కూర్చొంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కాగా బీఫ్​ బిర్యానీ నోటీసుపై మీడియా అధికారులను ప్రశ్నించింది. చికెన్​ బిర్యానీ బదులు, బీఫ్​ బిర్యానీ అని తప్పుగా అచ్చయినట్లు వెల్లడించారు. ఇది తెలిసి వెంటనే నోటీసు బోర్డు పై నుంచి తీసివేశామన్నారు. తప్పిదానికి చింతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా నోటీసులో ఏ అధికారి సంతకం లేనట్లు గుర్తించామన్నారు. అంతేగాక ఈ నోటీసుల జారీలో ఇద్దరు సీనియర్​ విద్యార్థుల పాత్ర ఉన్నట్లు గ్రహించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు.