మధురలో రౌడీషీటర్ ఎన్ కౌంటర్
Rowdy sheeter encounter in Mathura

లక్నో: కాశీ, అయోధ్య పూర్తయ్యాయి.. ఇక మధుర వంతు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే మధురలో పేరుమోసిన రౌడీషీటర్ ఎన్ కౌంటర్ అయ్యాడు. ఆదివారం ఉదయం రౌడీషీటర్ ఫాతి అసద్ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు హాఫూర్ లోని గర్ ముక్తేశ్వర్ కు వెళ్లారు. పోలీసులపై అసద్ దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుదాడికి దిగగా మృతి చెందాడు. ఇతడిపై యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో 36కు పైగా కేసులు నమోదయ్యాయి. రూ. 1 లక్షల రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఎన్ కౌంటర్ లో అసద్ మరణించినట్లు మధుర డిఐజి శైలేష్ పాండే ధృవీకరించారు. ఇతనిపై దోపిడీ, కిడ్నాప్, హత్య, వేధింపులకు సంబంధించి 18 కేసులు నమోదయ్యాయి. చాలారోజుల నుంచి పోలీసులకు కనిపించకుండా, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.