మయన్మార్​ లో ఆహార సంక్షోభం

చేతులెత్తేసిన ఐక్యరాజ్యసమితి

Mar 14, 2025 - 16:45
 0
మయన్మార్​ లో ఆహార సంక్షోభం

నేపిడా: మయన్మార్​ లో మరోమారు ఆహార సంక్షోభం వైపు పరిస్థితులు దారి తీసే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి పది లక్షల మందికి ఆహారం అందించే సహాయాన్ని నిలిపివేస్తున్న శుక్రవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి డబ్ల్యూఎఫ్​ పీ (వరల్డ్​ ఫుడ్​ ప్రొగ్రామ్​)కు ఫుల్​ స్టాప్​ పెట్టనున్నామని ప్రకటించింది. అంతర్జాతీయ ఆహార సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వెల్లడించింది. 2021 నుంచి పౌర ప్రభుత్వం తొలగించాక మయన్మార్​ లో ఆకలి సంక్షోభంలో కూరుకుపోయింది. 15.2 మిలియన్ల జనాభాలో మూడింట ఒక వంతు జనాభా తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఐక్యరాజ్యసమితికి కూడా అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఆర్థిక సహాయం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు, సమీక్ష అనంతరం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియరాలేదు. ఇప్పటికే మయన్మార్​ లో పలు కమ్యూనిటీలు ఆహార, ఆర్థిక, నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో మైనార్టీ రోహింగ్యా ముస్లిం కమ్యూనిటీలు లక్షలాది మంది ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఆ దేశం నుంచి ఇతర దేశాలకు మరిన్ని వలసలు పెరిగే అవకాశం పొంచి ఉంది.