రైల్వేకు రూ. 3 లక్షల కోట్లు?!

Railway Rs. 3 lakh crores?!

Jan 16, 2025 - 16:38
 0
రైల్వేకు రూ. 3 లక్షల కోట్లు?!

2025–26 కేటాయింపులకు సిద్ధం
ఫిబ్రవరి 1న బడ్జెట్​ లో ప్రకటన

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: రైల్వేల కోసం 2025–26 బడ్జెట్​ లో పెద్ద ఎత్తున కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2025 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి రైల్వే బడ్జెట్​ ను విడుదల చేయనున్నారు. 2021–22న రూ. 1.91 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్​ 2025–26 నాటికి రూ. 3లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 2022–23లో రూ. 2.04 లక్షల కోట్లు, 2023–24లో రూ. 2.60 కోట్లు, 2024–25 రూ. 2.65 లక్షల కోట్లుగా రైల్వే శాఖ బడ్జెట్​ ప్రకటించారు. రైల్వే బడ్జెట్​ 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మూలధన వ్యయ కేటాయింపులు 15–20 శాతం పెరిగొచ్చు. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్​ తో ఆధునిక రైల్వే స్టేషన్​ ల నిర్మాణం, కొత్త రైళ్లను ప్రారంభించడం, ట్రాక్​ నెట్​ వర్క్​ పై భారాన్ని తగ్గించడం వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కాగా 2024–25 బడ్జెట్​ 2.65 లక్షల కోట్లలో 80 శాతం రైల్వేశాఖ ఖర్చు చేసింది. సంవత్సరం ముగింపులోపు మరో 20 శాతాన్ని ఖర్చు చేయనున్నారు. 

రైల్వే శాఖలో ప్రయాణికుల సౌకర్యాలకు పెద్ద పీట వేయనున్నారు. పాత్ర ట్రాక్​ లను మార్చడం, లోకోమోటివ్​ లు, వ్యాగన్లు, కోచ్​ ల కొనుగోళ్లపై ఖర్చు కూడా పెరగొచ్చు. మరోవైపు లక్ష్యాలను పూర్తి చేసేందుకు పబ్లిక్​ ప్రైవేట్​ పార్టనర్​ షిప్​ (పీపీపీ) విధానం కింద పెట్టుబడులతో లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధానం ద్వారా రూ. 10వేల కోట్లు ఖర్చు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రూలింగ్​ స్టాక్​ కోసం రూ. 50,903 కోట్లు, ఇతర సౌకర్యాల కోసం రూ. 1.2 లక్షల కోట్లు, భద్రతకు రూ. 34,412 కోట్లు, బుల్లెట్​ రైల్​ ప్రాజెక్టుకు రూ. 21వేల కోట్లను ఖర్చు చేయాలని రైల్వే శాఖ యోచిస్తుంది. ముఖ్యమైన రైల్వే కారిడార్​ పనులు పూర్తి అయితే మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచనున్నారు. అనంతరం రైల్వే శాఖ ఆదాయాన్ని పెంచుకునే చర్యలను చేపట్టనున్నారు.