నాణ్యమైన ఉత్పత్తులే ఆర్థిక వ్యవస్థలకు మూలస్తంభాలు

ఒడిశా ఉత్కర్ష్​ కాన్​ క్లేవ్​ లో ప్రధాని మోదీ

Jan 28, 2025 - 14:13
 0
నాణ్యమైన ఉత్పత్తులే ఆర్థిక వ్యవస్థలకు మూలస్తంభాలు

డెస్టినేషన్​ హబ్​ గా మారుస్తాం
బలమైన ఆకాంక్షతోనే అభివృద్ధికి అవకాశం

భువనేశ్వర్​: వినూత్న సేవా రంగం, నాణ్​యమైన ఉత్పత్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు మూలస్తంభాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని వెడ్డింగ్​ డెస్టినేషన్​ హబ్​ గా మారుస్తామన్నారు. ఒడిశా ఎవ్వరూ ఊహించని విధంగా త్వరలో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. సీఎం మోహన్​ చరణ్​ మాఝీ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. భారత్​ బలమైన ఆకాంక్షే ఒడిశా అభివృద్ధికి కూడా కారణమని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఒడిశాలో అపార అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. ఒడిశాలోని ప్రకృతి అందాలు టూరిజం అభివృద్ధికి తోడ్పడతాయని మోదీ తెలిపారు. భువనేశ్వర్​ లో మంగళవారం జనతా మైదాన్​ లో నిర్వహించిన ఉత్కర్ష్​ ఒడిశా మేక్​ ఇన్​ ఒడిశా కాన్​ క్లేవ్​ సమ్మిట్​ ను ప్రారంభించారు. 

బలమైన సరఫరా గొలుసు ఏర్పాటు చేసుకుందాం..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా సదస్సులో ప్రసంగించారు. ఒడిశాలో ఇంతవరకూ జరిగిన సమ్మిట్​ లలో ఇదే అతిపెద్ద బిజినెస్ సమ్మిట్ అన్నారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వ్యాపారులు, పెట్టుబడిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. దేశ పురోగతి కేవలం ముడి పదార్థాల ఎగుమతుల ద్వారానే సాధ్యం కాదన్నారు. పర్యావరణ వ్యవస్థ కూడా కీలకమేనన్నారు. మారుతున్న ప్రపంచ తీరు తెన్నులపై ఎప్పటికప్పుడు మార్పు చేర్పులను స్వాగతిస్తూ ముందుకు వెళితేనే ప్రపంచ సరఫరా గొలుసును అందుకోగలమని, సవాళ్లను అధిగమించగలమన్నారు. గ్లోబల్​ దేశాల్లో హెచ్చు తగ్గులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటాయని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీతో బలమైన సరఫరా గొలుసును ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమలూ ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

ఆగ్నేయాసియాకు ఒడిశా ప్రధాన కేంద్రం..
తూర్పు భారతదేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు, ఓడరేవులు, వాణిజ్య రేవుల్లో ఒడిశాకు కూడా భారీ వాటా ఉందన్నారు. ఆగ్నేయాసిలో ఒడిశా ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదని గుర్తు చేశారు. ఇక్కడ ఎన్నో పురాతన ఓడరేవులు ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఒడిశా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రకృతికి నిలయాలుగా విలసిల్లుతాయని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ ఒడిశా ప్రాంత అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

మోదీ పర్యటనలు ఒడిశా పునాదికి బలం: సీఎం మోహన్​ చరణ్​ మాఝీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఏడుసార్లు ఒడిశాకు విచ్చేశారని, వచ్చినప్పుడల్లా రాష్​ర్టానికి ఎన్నోరకాల బహుమతులు, నిధులు, ప్రాజెక్టులు తీసుకువస్తున్నారని ఇందుకు తాను, ఒడిశా ప్రజలు ప్రధానికి రుణపతి ఉంటామని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపార సదస్సు చిన్నదేం కాదని రాబోయే కాలంలో ఈ సదస్సు ఫలితాలు ఒడిశా రూపురేఖలను పూర్తిగా మార్చే దిశలో ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒడిశా ఉదయానికి బలమైన పునాది వేసిన ప్రధాని మోదీకి సీఎం మాంఝీ వేల వేల కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కాన్​ క్లేవ్​ లో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ, గవర్నర్ హరిబాబు కంభంపాటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, జిందాల్ స్టీల్ అండ్​ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు.