కేజ్రీవాల్​ పై భగ్గుమన్న సీఎం సైనీ

CM Saini is jealous of Kejriwal

Jan 28, 2025 - 13:38
 0
కేజ్రీవాల్​ పై భగ్గుమన్న సీఎం సైనీ

యమునా నది కేజ్రీ ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే
పరువు నష్టం దావావేసే ఆలోచనలో ప్రభుత్వం
ఆరోపణలు నిరాధారం: ఢిల్లీ జల్​ బోర్డు సీఈవో శిల్పా షిండే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యమునా నదిలో హరియాణా బీజేపీ విషం కలుపుతుందన్న వ్యాఖ్యలపై ఆ రాష్​ర్ట సీఎం నయాబ్​ సింగ్​ సైనీ మండిపడ్డారు. వ్యాఖ్యలకు నిరసనగా హరియాణాలోని యమునా నది నీటిని ఢిల్లీకి సరఫరా కాకుండా నిలిపివేశారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్​ వ్యాఖ్యలపై మంగళవారం ఈసికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ కేజ్రీపై ఎదురు దాడికి దిగారు. నీటి నాణ్యతను తనిఖీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ప్రజలు త్వరలోనే ఆప్​ కేజ్రీవాల్​ కు గుణపాఠం చెబుతారని అన్నారు. విషపు నీళ్లని అనడం కేజ్రీవాల్​ దుస్సాహసానికి నిదర్శనమన్నారు. యమునా నీటిని తాము కూడా వాడుతున్నామని చెప్పారు. కాగా కేజ్రీవాల్​ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే హరియాణా ప్రభుత్వం పరువ నష్టం దావా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేజ్రీవాల్​ ప్రకటన నేపథ్యంలో నీటి నాణ్యతను తనిఖీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  కావాలనే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో హరియాణా ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడి తాము చర్యలు తీసుకుంటే ఢిల్లీ ప్రజలు కూడా కేజ్రీవాల్​ వైపు మళ్లుతారనే దుష్టపన్నాగం ఈయన వ్యాఖ్యల వెనుక దాగి ఉందన్నారు. ఇంతటి చౌకబారు, నీచమైన వ్యక్తులను తానెన్నడూ చూడలేదన్నారు. మరోవైపు కేజ్రీవాల్​ ఆరోపణలను ఢిల్లీ జల్​ బోర్డు సీఈవో శిల్పా షిండే తోసిపుచ్చారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ కేజ్రీవాల్​ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఢిల్లీ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తాయని, ఇరు రాష్​ర్టాల బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎల్జీ దృష్టికి తీసుకువెళ్లాలని షిండే శిల్పా షిండే తెలిపారు.