డిపాజిట్లకు ప్రోత్సాహం ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు

Promotion of deposits Financial Services Secretary M. Nagaraju

Feb 3, 2025 - 16:55
 0
డిపాజిట్లకు ప్రోత్సాహం ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ​: క్రెడిట్​ వృద్ధిని బలోపేతం చేసేందుకు, బ్యాంకు డిపాజిట్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు బడ్జెట్​ లో ప్రకటించిన పన్ను చర్యలు బ్యాంకులకు లిక్విడిటీని అందజేతాయని, ఋణాలివ్వడంలో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు అన్నారు. సోమవారం బడ్జెట్​ పన్ను మినహాయింపు, బ్యాంకింగ్​ రంగంపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. పన్ను మినహాయింపు పొందుతున్న వారి పొదుపులో పెరుగుదల ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. సీనియర్​ సిటిజన్ల నుంచి రూ. 15వేల కోట్ల డిపాజిట్లను ఆశిస్తున్నమని, ప్రస్తుతం 34లక్షల కోట్ల బ్యాంకు డిపాజిట్లు కలిగి ఉన్నారని అన్నారు. అదనపు డిపాజిట్లు రూ. 7వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. పన్ను మినహాయింపు వల్ల రూ. 20వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ప్రస్తుతం రూ. 4వేల కోట్ల అదనపు బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు నాగరాజు తెలిపారు. బ్యాంకు డిపాజిట్ల పెరుగుదలతో ఋణాలు ఇచ్చే వారి సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, డిపాజిట్లు పెరిగితే ఫిక్స్​ డ్​ డిపాజిట్లు పెరుగుతాయన్నారు. దీంతో విరివిగా ఋణాలు అందించి వృద్ధిని బ్యాంకులు ఆశించొచ్చని నాగరాజు తెలిపారు.