సింగిల్ విండోతో మైనింగ్ రంగం బలోపేతం
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీఐఎంఎస్ (ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ సిస్టం) ద్వారా బొగ్గు గనుల కేటాయింపు, పర్యవేక్షణ, రక్షణ, ఉత్పత్తి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వివరించారు. సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బొగ్గు గనుల లో సింగిల్ విండో సిస్టమ్ ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్, స్టీల్ ఉత్పత్తి కోసం విరివిగా బొగ్గు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రశ్నను లేవనెత్తిన ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ రంగంపై అత్యంత సూక్ష్మదృష్టితో బొగ్గు గనుల శాఖ మంత్రి పనిచేస్తున్నట్లు సమాధానంతో గుర్తించానని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ మాట్లాడుతూ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సింగిల్ విండో సిస్టమ్ అద్భుతమైనదని కీర్తించారు.
సింగి విండో క్లియరెన్స్ సిస్టమ్..
సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అనేది దేశంలోని బొగ్గు గనుల నిర్వహణ కోసం వివిధ అనుమతులను పొందేందుకు ఒక వేదికను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని పూర్తిగా చట్టబద్ధం చేశారు. ఈ విధానం ద్వారా తవ్వకాల ప్రణాళిక, మైన్ క్లోజర్ ప్రణాళిక ఆమోదం, మైనింగ్ లీజు మంజూరు, పర్యావరణం, అటవీ అనుమతులు, వైల్డ్ లైఫ్ క్లియరెన్స్, భద్రత, ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల పునరావాసం, కార్మికుల సంక్షేమం మొదలైనవి చేపడుతున్నారు. ఈ అనుమతులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ రాష్ర్టాల ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలు మంజూరు చేస్తాయి. అనుమతుల మంజూరు కోసం ఈ ఏకీకృత వేదిక ద్వారా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రధాని మోదీ సహకారంతో సింగిల్ విండో సిస్టమ్ కు శ్రీకారం చుట్టి మైనింగ్ రంగంలో నూతన ఒరవడిని చాటారు.