ప్రయాగ్​ రాజ్​ లో నిషేధాజ్ఞలు అమలు

Prohibitory orders implemented in Prayagraj

Jan 17, 2025 - 16:15
 0
ప్రయాగ్​ రాజ్​ లో నిషేధాజ్ఞలు అమలు

ఉత్తర్వులు జారీ చేసిన అదనపు పోలీస్​ కమిషనర్​

లక్నో: యూపీ ప్రయాగ్​ రాజ్​ లో కుంభమేళా సందర్భంగా శాంతిభద్రత సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు విధించారు. శుక్రవారం నుంచి ఈ నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయని అదనపు పోలీస్​ కమిషన్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్, 2023 (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023)లోని సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేశారు. 

కుంభమేళా ఉత్సవాల సమయంలో సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంటూ జిల్లా మతపరమైన సున్నితత్వంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధిత ఉత్తర్వు ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 

బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు లాంటి ఆందోళనలపై నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. డ్రోన్ల ఎగురవేత, ఆయుధాలు, తొపాకులు కలిగి ఉండడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉద్రిక్తతలకు ప్రేరేపించే, మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు, ప్రసారాలు, ప్రచారాలు, కంటెంట్​ ప్రసారంపై కూడా నిషేధం కొనసాగనుంది. మేళా అవసరాలకు తరలివస్తున్న వాహనాలకు ఆటంకాలు కల్పించడం, రవాణా వాహనాలను అడ్డుకోవడం వంటివి చేయొద్దన్నారు. జనవరి 29న (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి), ఫిబ్రవరి 12 (మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) ప్రధానంగా పుణ్యస్నానాలకు భక్తులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉండడంతో ఇంటలిజెన్స్​ హెచ్చరికలతో యూపీ ప్రభుత్వం అత్యంత పకడ్భందీ చర్యలను చేపడుతుంది. కుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే గాకుండా రోజువారి అధికారిక సమీక్షలు, సమావేశాలు పలు ప్రాంతాల్లో పర్యటనలు చేపడుతూ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు.