మూడు రాష్ట్రాలకు ప్రధాని ఆవిర్భావ శుభాకాంక్షలు
Prime Minister's greetings to the three states
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం మూడు రాష్ర్టాలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. 1972 జనవరి 21న ఈ రాష్ర్టాలు పూర్తి రాష్ర్ట హోదాలను పొందాయి. ప్రజల కృషిని కొనియాడారు. ఈశాన్యంలో ఉన్న శక్తివంతమైన రాష్ర్టాలని, సంస్కృతికి, స్ఫూర్తిదాయకమైన చరిత్రకు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయన్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ర్టాలు కీలక భాగస్వామ్యం అందజేస్తున్నాయని కీర్తించారు. ఈ మూడు రాష్ర్టాలు అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకోవాలని మంత్రి అమిత్ షా అన్నారు.