కేజ్రీకి ఏడుగురు ఎమ్మెల్యేల ఝలక్​!

Seven MLAs Resion aap

Jan 31, 2025 - 18:18
 0
కేజ్రీకి ఏడుగురు ఎమ్మెల్యేల ఝలక్​!

ఆప్​ కు రాజీనామా.. అవినీతి కారణమంటూ లేఖలు
పోస్టల్​ బ్యాలెట్ల ఓట్ల నమోదు
కౌంటింగ్​ కు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం.. ఈసీఐ ఆమోదం
11 జిల్లాల్లో 19 కౌంటింగ్​ కేంద్రాల ఏర్పాటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ పార్టీ కేజ్రీవాల్​ కు ఏడుగురు ఎమ్మెల్యేలు భారీ ఝలక్​ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఐదు రోజుల ముందు శుక్రవారం సాయంత్రం తమ రాజీనామాను సమర్పించారు. వీరి రాజీనామాకు ఆప్​ పార్టీ అవినీతే కారణమని విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అన్నా హజారే విలువలకు తిలోదకాలిచ్చారని, ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలెవ్వరూ ఆప్​ పార్టీకి ఓట్లు వేసేది లేదని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. దీంతో తమ రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాజీనామా చేసిన వారిలో జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి, కస్తూర్బానగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే, దళిత నాయకుడు రోహిత్ కుమార్, పాలెం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఉన్నారు. వీరంతా తమ రాజీనామాలో ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆప్​ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ ఈ రాజీనామాల అంశం ఓటింగ్​ పై తీవ్ర ప్రభావం మాత్రం చూపనుంది. దీంతో కేజ్రీవాల్​ ఏం చేయాలో తెలియక నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది. 

పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల నమోదు..

ఢిల్లీ ఎన్నికల్లో శుక్రవారం వరకూ 5848 పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు పోలైనట్లు ఎన్నికల ప్రధానాధికారి అలిస్ వాజ్​ తెలిపారు. అదేసమయంలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఈ ప్రణాళికను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కూడా ఆమోదించిందన్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో 19 కౌంటింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.