ప్రధాని మోదీ రంజాన్​ శుభాకాంక్షలు

Prime Minister Modi wishes Ramzan

Mar 2, 2025 - 13:13
 0
ప్రధాని మోదీ రంజాన్​ శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ పవిత్ర రంజాన్​ మాసం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం విలసిల్లాలని కోరారు. పవిత్ర మాసం రంజాన్​ భక్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కరుణ, దయ లాంటి విలువలను సమాజానికి తెలియజేస్తుందని మోదీ చెప్పారు. భారత్​ లో ఆదివారం నుంచి రంజాన్​ నెల ఆరంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఆదివారం నుంచి పర్వదినం ప్రారంభమైనట్లు ప్రకటించారు. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం, మానవాళికి సేవ చేయడం వంటి సద్గుణ కార్యాలు రంజాన్​ మాసానికి ప్రతీక అని అభివర్ణించారు. పవిత్ర మాసంలో స్వీయ క్రమశిక్షణ, సహనం, ఆరాధన వంటి మంచి పనులతో సోదరభావంతో విలువలను పెంపొందించుకోవాలని సీఎం యోగి పేర్కొన్నారు.