టెస్లా షోరూమ్​ అద్దె రూ. 35 లక్షలు!

Tesla Showroom Rent Rs. 35 lakhs!

Mar 2, 2025 - 18:16
 0
టెస్లా షోరూమ్​ అద్దె రూ. 35 లక్షలు!

ముంబాయి: ముంబాయిలో టెస్టా తన పనిని ప్రారంభించింది. షోరూమ్​ ను అద్దెకు తీసుకుంది. అద్దెకు రూ. 35 లక్షలు వెచ్చించడం గమనార్హం.   ఈ విషయాన్ని బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్​) ఆదివారం వెల్లడించింది. ఒప్పందం ప్రకారం 4వేల చదరపు అడుగుల స్థలానికి నెలలవారీ అద్దె చదరపు అడుగుకు రూ. 900గా ఉందని, మొత్తం అద్దె రూ. 35 లక్షలని తెలిపింది. ఐదు సంవత్సరాల అద్దె ఒప్పందం కుదరిందని బీకేసీ వివరించింది. టెస్లా సంస్థ ఏప్రిల్​ నుంచి కార్ల అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముంబాయితోపాటు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా టెస్టా షోరూమ్​ ను ప్రారంభించాలని స్థలం కోసం అన్వేషణ కొనసాగిస్తుంది.